Redmi 17C 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ రెడ్మి నుంచి తాజాగా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ విడుదలైంది. హెచ్డి+ ఎల్సీడీ డిస్ప్లే, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. డార్క్ నైట్, కాఫీ బ్రూ, పర్పుల్ డాన్ వంటి కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి. ఈ ఫోన్ ధరలు రూ.20,999, రూ.22,999. ప్రారంభ ఆఫర్ కింద వివిధ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ నెల 7 నుంచి అమెజాన్, రెడ్మి స్టోర్స్‌లలో సేల్కు అందుబాటులో ఉంటుంది.
6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్నెస్, లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ ఆపరేషన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, 50 ఎంపీ ఏఐ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ 64, వెట్ టచ్ టెక్నాలజీ 2.0, 200 శాతం వాల్యూ బూస్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి.