హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో 7 రాష్ర్టాల నుంచి 365 మంది క్రీడాకారులు పోటీపడ్డారు.
పాయింట్ల పట్టికలో తెలంగాణ 570 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, తమిళనాడు 505 పాయింట్లతో రెండో స్థానంలో రన్నరప్‌గా నిలిచింది. రాష్ర్టానికి చెందిన అద్రితీ శ్రా, షనాయ, అస్ఫా నూర్, అరీబా ఫాతిమా తదితరులు స్వర్ణాలు గెలిచారు.