Medicover | 55 వేలు వాపస్ ఇచ్చిన మెడికవర్.. ‘నమస్తే తెలంగాణకు’కు కృతజ్ఞత తెలిపిన కుటుంబం
Medicover | నగదు రహిత వైద్యం అందాల్సిన ఎంప్లాయీస్ హెల్త్ సీమ్ (ఈహెచ్ఎస్)లో నిర్లక్ష్యంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మెడికవర్‌లో పనిచేయని హెల్త్ కార్డు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది.
Medicover | హనుమకొండ, అక్టోబర్ 6 : నగదు రహిత వైద్యం అందాల్సిన ఎంప్లాయీస్ హెల్త్ సీమ్ (ఈహెచ్ఎస్)లో నిర్లక్ష్యంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మెడికవర్‌లో పనిచేయని హెల్త్ కార్డు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. హనుమకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ దవాఖాన యాజమాన్యం చికిత్స పొందుతూ మృతిచెందిన పెన్షనర్ సౌరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.55 వేల నగదును మంగళవారం తిరిగి చెల్లించింది.
ఇటీవల వరంగల్ దేశాయిపేటకు చెందిన సౌరం వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మెడికవర్ దవాఖానలో చేరగా, ఈహెచ్ఎస్ హెల్త్‌కార్డు ఉన్నప్పటికీ నగదు రహిత వైద్యం అందలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. చికిత్సకోసం రూ.55 వేలు వసూలు చేసినట్టు కుటుంబసభ్యులు, పెన్షనర్ సంఘాల నాయకులు వెల్లడించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతిచెందడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మెడికవర్‌లో పనిచేయని హెల్త్‌కార్డు’ కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆదేశాలతో దవాఖాన యాజమాన్యం వసూలు చేసిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తిరిగి అందజేసింది. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హనుమకొండ ఎస్టీవో జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఐదు నెలలుగా 1.5 శాతం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నప్పటికీ నగదు రహిత వైద్యం కార్పొరేట్ దవాఖానల్లో అమలు కాకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఈహెచ్ఎస్ కార్డు ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు ఎలాంటి సిఫారసులు, పలుకుబడి అవసరం లేకుండా కార్పొరేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల సిఫారసులతో కొందరికి మాత్రమే కార్డులు ఆమోదించి, మిగిలిన వారికి ఇబ్బందులు కల్పించడం సరికాదని, దీన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఖండించాలని పిలుపునిచ్చారు. హెల్త్ కార్డు తీసుకుని దవాఖానకు వెళ్లిన వెంటనే నగదు రహిత వైద్యం ప్రారంభమయ్యేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రూ.55 వేలు తిరిగి అందడంతో సౌరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, పెన్షనర్ సంఘాల నాయకులు ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Don’t Trouble the Trouble | ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..!
Cyclone Arnab | తీరం దాటుతున్న ‘అర్నబ్’.. మరో రెండు గంటలు కీలకం!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

