న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మేబాక్ ఎస్ 580ఈ పేరుతో విడుదల చేసిన ఈ కారు ధరను రూ.3.35 కోట్లుగా నిర్ణయించింది. కేవలం 30 యూనిట్లు మాత్రమే భారత్లో విక్రయించనున్న ఈ మాడల్ తొలి పీహెచ్ఈవీ కావడం విశేషం. ఎలక్ట్రిక్తోపాటు పెట్రోల్ ఇంజిన్తో కలిసి రూపొందించింది.
11 కిలోవాట్ల నుంచి 60 కిలోవాట్ల వరకు డీసీ చార్జింగ్ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్త 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో తయారైన ఈ మాడల్ 34.48 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.