Jobs | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 250 పోస్టులను నింపనుంది. దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది. 28 వరకు కొనసాగుతుంది.
పోస్టుల వివరాలు
గ్రూప్-బి నాన్ గెజిటెడ్ కేడర్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA). 250 ఖాళీలు
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2026, సెప్టెంబర్ 1 నాటికి డిగ్రీ పాసైనవారు అర్హులు. దీంతో పాటు కంప్యూటర్(Computer)లో పరిజ్ఞానం ఉండాలి. కనీసం నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.

Posts
వయసు
ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఓబీసీ (Non-Creamy Layer), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక
ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో (ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, రిటన్ టెస్ట్ (Descriptive), ఇంటర్వ్యూ) జరుగుతుంది.
1) ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంగ్లిష్, కాంప్రహెన్షన్‌తో కలిపి- 20, జనరల్ ఆప్టిట్యూడ్- 15, జనరల్ నాలెడ్జ్- 15, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు జ్యూడీషియరీ ఇన్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- 15, సుప్రీం కోర్టు రూల్స్ 2013- 10, సుప్రీం కోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ (Conditions of Service and Conduct) రూల్స్ 1961- 10, కంప్యూటర్ నాలెడ్జ్- 15 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. సమయం 90 నిమిషాలు.
2) టైపింగ్ స్పీడ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు. సమయం 10 నిమిషాలు.
3) రిటన్ టెస్ట్‌ను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. దీనిలో కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ప్రిసైస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి. సమయం 2 గంటలు.
4) ఇంటర్వ్యూ 25 మార్కులకు నిర్వహిస్తారు.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 1500. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు రూ. 750.
జీతం
ఎంపికైనవారికి లెవల్ 6 ప్రకారం నెలకు రూ. 35,400+ఇతర అలవెన్సులు ఇస్తారు.

Apply
చివరితేదీ
దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28తో ముగుస్తుంది.
పరీక్ష కేంద్రాలు
దేశ వ్యాప్తంగా 131 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
టైపింగ్, డిస్క్రిప్టివ్ టెస్టులు, ఇంటర్వ్యూ ఢిల్లీలో నిర్వహిస్తారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ sci.gov.inలో చూడండి.