పోలవరం, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని అధికారులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్ఓహ్రా ఆదేశించారు.
ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.