– ఇ. వెంకటేశ్, తిరుమలగిరి.
ఇంటికి ఉత్తరంలోని వాయవ్య భాగంలో లిఫ్ట్ పెట్టుకోవచ్చు. టాయిలెట్ కట్టవచ్చు. కానీ, బాల్కనీలో అవి రెండూ ఏర్పాటు చేయడం ఇబ్బంది. మీరు ఉత్తర-వాయవ్యం పెంచి ఇంటి వాయవ్యం లోనుంచి టాయిలెట్ వాడుకోవాలని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. తిరిగి అక్కడే లిఫ్ట్ పెట్టడం వల్ల ఆచోట వాయవ్య భాగం ఉండదు. లెట్రిన్ కోసం లోపలి నుంచి వాడేసుకున్నారు కదా! ఇక లిఫ్ట్ కోసం స్థానం ఎక్కడ ఉంటుంది? ఉన్నా.. అది వాయవ్యం కాదు. ఉత్తరం అవుతుంది. టాయిలెట్ లోపలి నుంచి వాడకూడదు. మీరు టాయిలెట్ పెట్టకుండా కేవలం లిఫ్ట్ పెట్టుకోండి. తూర్పు-ఉత్తరం బాల్కనీలు ఉంటే.. తూర్పు-ఆగ్నేయంలో ఇంటిని, బాల్కనీ రెయిలింగ్నీ తగలకుండా టాయిలెట్ కట్టండి. అంటే, తూర్పు బాల్కనీ ఎనిమిది అడుగులు ఉంటే.. అక్కడ టాయిలెట్ వేసుకోవచ్చు. దేనికీ అంటకుండా! అంత స్థలం లేనప్పుడు ఆ ఆలోచన మానుకోండి. లిఫ్ట్‌ను అటు వాయవ్యం లేదా ఆగ్నేయంలో.. రెండు స్థలాలలో ఏ చోట అయినా పెట్టుకునే అవకాశం ఉంది. సరైన దిశలలో సరైన స్థలం ఉంటేనే.. ఏవైనా కుదురుతాయి. అన్నీ సరిచూసుకొని, తెలుసుకొని చేయండి.
– డి. శివకుమార్, షాద్‌నగర్.
ప్రకృతి మధ్య ఇల్లు ప్రశాంతంగా ఉండటం కోసం ఫార్మ్‌హౌస్‌లు కడుతుంటారు. అందుకని వరండాను ఇష్టపడుతుంటారు. ఇల్లు ఏచోట ఉన్నా సాధారణమే! ఒక పడక గది, కిచెన్, హాల్ సహజంగానే ఉంటాయి. విశాలమైన స్థలంలోనే ఇవి ప్లాన్ చేస్తారు కాబట్టి, ఇంటి చుట్టూ అరుగులు, విశాలంగా వేసి, దానిమీద కప్పు వేస్తే.. ఎంతో ఆనందంగా, ఓపెన్‌లో ఉన్నట్టు ఉండి ఎండ, వానల నుంచి రక్షణ కల్పిస్తుంది.

అందుకు వరండాలు వేసుకుంటారు. ఇంటి చుట్టూ కాకపోయినా.. తూర్పు-ఉత్తరాలలో కూడా వరండాలు వేసుకోవచ్చు. అవి ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఆరు అంగుళాలు కిందికి ఉండాలి. కనీసం ఏడు అడుగులకు తగ్గకుండా, పది అడుగులకు మించకుండా ఉంటే.. ఎంతో అనుకూలంగా ఉంటుంది. వరండా అంచుల వద్ద తొమ్మిది అడుగుల ఎత్తు తప్పనిసరిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. విశాలమైన కిటికీలు ఉండాలి.
– వి. సుశీల, జీడిమెట్ల.
పాత ఇంటిని సరి చేసుకున్నాకే.. కొత్త ఇల్లు మొదలుపెట్టాలి. ఊరికి ఫోన్ చేసి, నాన్నకు కొత్త సెల్‌ఫోన్ కొనుక్కొని వస్తున్నట్లు చెప్పాలంటే.. ప్రస్తుతం ఆయన వాడుతున్న పాత ఫోన్ కూడా బాగుండాలి కదా! ఇల్లు కూడా అంతే! మంచి ఇంట్లో ఉంటూనే మరో మంచి ఇల్లు కట్టగలం. చాలామంది నైరుతి వీధిపోటు, ఆగ్నేయం వీధిశూల ఉన్న గృహాలలో ఉండి, కొత్త ఇల్లు కట్టుకుంటే.. మంచి ఇంట్లోకి చేరినా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. నూతన గృహం నిర్మాణానికై, ఉన్న గృహం బాగలేకపోతే తప్పక మారాలి. అంటే, అద్దెకు ఒక మంచి ఇంట్లోకి మారిపోయి, మరొక గొప్ప ఇల్లు కట్టుకోవాలి. ఎన్నో రకాల ఇబ్బందులు సహజంగానే ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది బాగాలేని ఇంట్లో ఉండి, తర్వగా పూర్తి చేసుకుందాం అంటే.. ఆ పనికాదు. ఆలస్యం కావొచ్చు. లేదా ఆరోగ్యాలు చెడిపోవచ్చు. అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకోవద్దు. మంచి గృహాన్ని మరో మంచి ఇంట్లో ఉంటూ కట్టాల్సిందే!
– డి. ప్రణయ్, వరంగల్.
స్థలం ఉన్న విధంగానే ఎప్పుడూ ఇల్లు కట్టవద్దు. సరిచేసి కట్టాలి. మీది దక్షిణ-నైరుతి పెరిగిన ‘ఎల్’ ఆకారం ఇల్లు. స్త్రీల మీద, పురుషుల మీద ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోతాయి. నిత్యం మందులు మింగాల్సి వస్తుంది. దక్షిణం నుంచి ఉత్తరం వరకు ఉన్న కొలతను చూసి, ఒక దీర్ఘచతురస్రపు ఆకారంగా మార్పు చేయాలి. మిగతా భాగం తొలగించాలి. అంటే మీది తూర్పు రోడ్డు కాబట్టి, తొలగించిన స్థలం రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. అది రోడ్డుగా మారుతుంది. గొప్ప మార్పును తెస్తుంది. ఈ విధంగా మార్పు చేయడానికి సిద్ధపడితే తప్పక చేయండి. కుదరకపోతే మీరు ఇల్లు మారండి. దానిని కమర్షియల్‌గా వాడండి. మీరు ఉండటం మంచిదికాదు. ఇంటి నిర్మాణం, ఇంటి స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఒక నెగెటివ్ ఎనర్జీ ఉత్పన్నమై వ్యక్తుల ఆర్గాన్స్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే, నైరుతి పెరిగిన గృహంలో హార్ట్ సర్జరీలు, అకాల మరణాలు సంభవిస్తాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143