రేపు ఈఎంసి పరిధిలో దీక్షా దివస్ వేడుకలు
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణలో రేపు దీక్షా దివస్ వేడుకలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ నేత బెల్లం వేణుగోపాల్ తెలిపారు. నియోజకవర్గస్థాయి పరిధిలో జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం...
ఖమ్మం రూరల్, నవంబర్ 28 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణలో రేపు దీక్షా దివస్ వేడుకలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ నేత బెల్లం వేణుగోపాల్ తెలిపారు. నియోజకవర్గస్థాయి పరిధిలో జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే దీక్షా దివస్ వేడుకలలో ముఖ్య అతిథులుగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పాల్గొననున్నట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలంతో పాటు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. అదే విధంగా ఆయా గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ కేటగిరిలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- EMC
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

