న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కీలక నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్ఎంఈల కోసం వృద్ధి-ఆధారిత మూలధనాన్ని అందించడానికి, తయారీ, సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణ ఆధారిత రంగాలు, వ్యూహాత్మక విలువల్లో దేశంలో అగ్రగామి సంస్థలుగా తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ ఈ భారీ ఫండ్‌ను ప్రకటించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
దేశీయంగా ఉన్న చిన్నా చితక సంస్థలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలువాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసినట్టు, ప్రారంభ దశలో ఉన్న సంస్థలకు ఆర్థిక సహాయం లభించనున్నదన్నారు.