Jobs | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) 641 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్, ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్లను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 127
పర్సనల్ అసిస్టెంట్(డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 189
పర్సనల్ అసిస్టెంట్(ఫ్యామిలీ కోర్టులు)- 17
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 151
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ (ఫ్యామిలీ కోర్టులు)- 23
ప్రాసెస్ సర్వర్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 91
ప్రాసెస్ సర్వర్ (ఫ్యామిలీ కోర్టులు)- 3
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 37
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ (ఫ్యామిలీ కోర్టులు)- 3

Dsssb Posts
అర్హతలు
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 110, టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి.
పర్సనల్ అసిస్టెంట్లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100, టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూర్పై నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి.
ప్రాసెస్ సర్వర్లకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్లకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
అభ్యర్థులకు వయసు 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, జనరల్/ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 10, ఓబీసీ దివ్యాంగులకు 13, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్లకు రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ ఇంగ్లిష్ టెస్ట్, షార్ట్‌హ్యాండ్, టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్రాసెస్ సర్వర్లకు రాత పరీక్ష, డ్రైవింగ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్లకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
జీతం
సీనియర్ అసిస్టెంట్లకు రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,800 (గ్రూప్-బి నాన్ గెజిటెడ్)
పర్సనల్ అసిస్టెంట్లకు రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,600 (గ్రూప్-బి నాన్ గెజిటెడ్)
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్లకు రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,800 (గ్రూప్-సి)
ప్రాసెస్ సర్వర్లకు రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,400 (గ్రూప్-సి)
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్లకు రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000 (గ్రూప్-సి)
దరఖాస్తు ఫీజు రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
చివరితేదీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 4వ తేదీతో ముగుస్తంది. ఇతర వివరాలకు వెబ్సైట్ https://dsssb.delhi.gov.inలో చూడండి.

Job Apply