Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
Panchayat Season 5 | గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ కామెడీ వెబ్ సిరీస్ 'పంచాయత్' (Panchayat) సీజన్ 5 త్వరలోనే అలరించడానికి సిద్ధమవుతోంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ (Panchayat) సీజన్ 5 త్వరలోనే అలరించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 3న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ కొత్త సీజన్ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఫులేరా గ్రామ ఎన్నికల రాజకీయాలు, ఊహించని పరిణామాలు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఉత్కంఠను పంచనున్నాయి. ఈ తాజా సీజన్లో జితేంద్ర కుమార్ (అభిషేక్), రఘుబీర్ యాదవ్ (ప్రధాన్ జీ), నీనా గుప్తా (మంజు దేవి), అశోక్ పాఠక్ తదితరులు తమ అద్భుతమైన నటనతో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.
గత సీజన్ ముగింపులో ఫులేరా రాజకీయాల్లో ఊహించని భూకంపమే వచ్చింది. దశాబ్దాలుగా గ్రామ రాజకీయాలను శాసించిన ప్రధాన్ జీ, ఆయన భార్య మంజు దేవి ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూశారు. వారి స్థానంలో ప్రత్యర్థి క్రాంతి దేవి గ్రామ కొత్త ప్రధాన్‌గా పగ్గాలు చేపట్టగా, ఆమె భర్త భూషణ్ అలియాస్ ‘బన్రాకాస్’ తెరవెనుక చక్రం తిప్పుతూ మరింత పవర్‌ఫుల్‌గా మారారు. దీంతో కొత్త పాలకుల రాకతో గ్రామ కార్యదర్శి అభిషేక్‌కు కష్టాలు మొదలవుతాయి. ప్రతీకార ధోరణితో వ్యవహరించే కొత్త నాయకత్వం మధ్య అభిషేక్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు, తన కల అయిన ఎంబీఏ (MBA) పూర్తి చేయడానికి సిద్ధమవుతున్న అభిషేక్.. గ్రామంలో ఇంకా ఏయే సమస్యలకు ముగింపు పలుకుతాడు? బన్రాకాస్ అల్లరి ఏ స్థాయిలో ఉంటుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సీజన్ సాగనుంది. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్న ‘పంచాయత్’ సిరీస్, ఇప్పుడు ఐదవ సీజన్‌తో మరింత వినోదాన్ని పంచేందుకు వస్తోంది. డిసెంబర్ 3 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
thodi takraar thoda pyaar rahega, phulera mein aapka intezaar rahega 🙏🏠
#PanchayatOnPrime, New Season, Dec 3
@TheViralFever @ArunabhKumar @StephenPoppins @chandan_txt @vijaykoshy @metaltoothpk @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka @Durgesh81091370 @SunitaRajwar @ashok_pathak3 #BullooKumar
— prime video IN (@PrimeVideoIN) November 18, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
Reading Vs Listening | వినడం లేదా చదవడం.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

