ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
కాల పరిమితి దాటి సంవత్సరాలు గడిచిన సహారా సంస్థ తిరిగి ప్రజలకు డబ్బులు ఇవ్వడంలో విఫలమైందని వడ్ల బాలయ్య మండిపడ్డారు
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: దేశంలో 13 కోట్ల పేద, మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో పిల్లల పెండ్లిలకు, చదువులకు, గృహ నిర్మాణాలకు, నిత్య అవసరాలకు పనికోస్తాయని కొండంత ఆశతో సహారా ఇండియా సంస్థలో పొదుపు చేసుకుంటే కాల పరిమితి దాటి సంవత్సరాలు గడిచిన సహారా సంస్థ తిరిగి ఇవ్వడంలో విఫలమైందని తెలంగాణ సహారా ఖాతాదారుల, కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల బాలయ్య మండిపడ్డారు. ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం సహారా బాధితులను పట్టించుకోవ డంలేదని బుధవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు గోడు వెల్లబోసుకున్నారు. సహారా సంస్థ సెబి కేసు సుప్రీంకోర్టులో 2012 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కేసు కొనసాగడం వలన ఖాతాదాలకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు.
ప్రజలకు న్యాయం చేయాల్సిన కోర్టులు కాలయాపన వలన వేలాదిమంది ఖాతాదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, వందలాది మంది ఏజెంట్లు మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకొని చనిపోయారని, ఖాతాదారులు మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యాలకు గురైతున్నారన్నారు. దేశ జనాభాలో 11 శాతం ఉన్న ఖాతాదారుల సమస్యను రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా కష్టాలు తీర్చడంలో ముందు ఉంటామని ఎలక్షన్ ప్రచారంలో ప్రగల్బాలు చెప్పే రాజకీయ నాయకులు సహారా ఇండియా ఖాతాదారుల కష్టాలు కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఆరు, ఏడు సంవత్సరాల క్రితం నుంచి దేశంలో వివిధ రూపల్లో ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో సహారా బాధితుల, కార్యకర్తల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుండేటి కుమార్, సహాయ కార్యదర్శి నాగబండి రాము, వరంగల్ జిల్లా అధ్యక్షుడు డి.నరేందర్బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
Reading Vs Listening | వినడం లేదా చదవడం.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది..?
Library | గ్రంథాలయంలో నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం
Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?
Health tips | పొట్టకింది కొవ్వుతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఆ కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

