Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?
Komatireddy Rajagopal Reddy | వెనుకబడ్డ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాననాల్సింది పోయి పండబెట్టి తొక్కుతవా..? ఏం తొక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..? అని రేవంత్ రెడ్డిని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
Komatireddy Rajagopal Reddy | సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏమంటడు.. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు తీసుకపోతుండంటడా.. ఎవడాడు.. పండబెట్టి తొక్కుతా అంటడు.. నువ్వేం ముఖ్యమంత్రికి.. నీ భాష ఏందయ్యా.. మంత్రిగా లేకున్నా సరే కానీ మీరే ఉండండి.. పదవుల్లో.. ఏమన్నా అంటే కొడంగల్ అంటవ్.. ఆయన మధిర అంటుండు.. ఉత్తమ్ కుమారేమో హుజూర్ నగర్ అంటుండు.. మరి మా పరిస్థితి ఏంది.. నేనడిగిన దాంట్లో తప్పేముంది.. అడుగొద్దా..? అని ప్రశ్నించారు.
ఒక ముఖ్యమంత్రిగా.. రూ.10 వేల కోట్లు కొడంగల్ తీసుకుపోతా అంటున్నవ్ కదా.. మునుగోడు శాసనసభ్యుడిగా అడుగుతున్నా ఇది అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న కరువు ప్రాంతం.. విషం తాగుతున్నరు.. జనం.. చెరువు, కుంటకు కూడా ఒక రూ.500 కోట్లు ఇయ్యకపోతిరి.. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మూడేండ్లాయె.. ఇంకా పనిమొదలే కాకపాయే.. మరి రోడ్లకు పైసలియ్యకపోతిరి.. ప్రభుత్వ బడులు, చౌటుప్పల్‌లో వంద పడుకల ప్రభుత్వ ఆస్పత్రి మొదలు కూడా కాలేదు.. మరి అడగపోతే ఎట్లా..? నాలుగు గోడల మధ్య రిప్రజెంటేషన్ ఇస్తేనేమో మీరు పట్టించుకుంటలేరాయే.. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటుంది.. ఏం క్రమశిక్షణ నువ్వేం అంటవ్.. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాకపోతే.. రూ.20 వేల కోట్లు తీసుకుపోనని రాజగోపాల్ రెడ్డి సూచించారు.
ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు అడుగుతుంటే అది పాజిటివ్‌గా ఆలోచించి వెనుకబడ్డ నియోజకవర్గాలను అన్నింటిని అభివృద్ధి చేస్తాననాల్సింది పోయి పండబెట్టి తొక్కుతవా..? ఏం తొక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..? నీకు అదృష్ణం కలిసొచ్చింది ముఖ్యమంత్రి అయినవ్.. ఇంకా రెండేళ్లు కూడా మంచిగా ఉండు.. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకో.. కొడంగల్‌తోపాటు వెనుకబడిన నియోజకవర్గాలు మునుగోడుతోపాటు ఆదిలాబాద్ కానీ , ములుగు కానీ వాటిని కూడా మంచిగా చూసుకో నాయనా.. అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు.
ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు
రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను “పండబెట్టి తొక్కుతా” అంటున్నాడు
నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి?
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?
Health tips | పొట్టకింది కొవ్వుతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఆ కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
Kaloji Kalakshetram | కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించొద్దు : అంపశయ్య నవీన్
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

