PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
PP Bribe | నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణను సులభతరం చేయడానికి లంచం తీసుకున్న పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
పెద్దపల్లి : నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణను సులభతరం చేయడానికి లంచం తీసుకున్న పెద్దపల్లి ( Peddapalli) కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. పీపీకి సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను సైతం పట్టుకుని కేసు నమోదు చేశారు.
క్రైం కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు కేసు సులభతరం చేయడానికి, న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉన్న ధర్మారం పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ నంబర్లో కేసును అజ్కోటల్లో ముగించడానికి చర్యలు తీసుకోవాలని పీపీని మధ్యవర్తి ద్వారా కలిశారు. అయితే ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి అనంతరం రూ.1.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
దీంతో ఫిర్యాదుదారులు ఏసీబీని ఆశ్రయించారు. అధికారులు వ్యూహం ప్రకారం బుధవారం వలపన్ని లంచం తీసుకుంటున్న పీపీని, మధ్యవర్తిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరిని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
Reading Vs Listening | వినడం లేదా చదవడం.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది..?
Library | గ్రంథాలయంలో నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

