Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
car Stolen With Sleeping Girl | ఒక కుటుంబం రెస్టారెంట్‌కు వెళ్లింది. కుమార్తె కారులో నిద్రిస్తుండటంలో ఆమెను అందులో ఉంచిన తల్లిదండ్రులు భోజనం కోసం లోపలకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి చూడగా బాలికతో సహా ఆ కారు మాయమైంది.
చెన్నై: ఒక కుటుంబం రెస్టారెంట్‌కు వెళ్లింది. కుమార్తె కారులో నిద్రిస్తుండటంలో ఆమెను అందులో ఉంచిన తల్లిదండ్రులు భోజనం కోసం లోపలకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి చూడగా బాలికతో సహా ఆ కారు మాయమైంది. ఆందోళన చెందిన పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఆ బాలికను పోలీసులు కాపాడారు. అలాగే కారు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Car Stolen With Sleeping Girl) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 15న రాత్రి వేళ దంపతులు తమ 12 ఏళ్ల కుమార్తెతో కలిసి కారులో ప్రయాణించారు. కారు వెనుక సీటులో ఉన్న ఆ బాలిక నిద్రపోయింది.
కాగా, ఆ దంపతులు వల్లంచేరిలోని ఒక రెస్టారెంట్ వద్ద కారును పార్క్ చేశారు. నిద్రిస్తున్న తమ కుమార్తెను అందులోనే ఉంచారు. భోజనం కోసం వారు రెస్టారెంట్లోకి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి కారు, అందులో ఉన్న తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గుడువాంచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మాయమైన కారు, అందులో ఉన్న బాలిక కోసం వెతకడం ప్రారంభించారు.
మరోవైపు బాలిక ఉన్న కారును చోరీ చేసిన వ్యక్తి 230 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాడు. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మయిలాదుతురై జిల్లా సిర్కాళిలోని కొత్త బస్టాండ్ వద్ద ఆ బాలిక కారు నుంచి తప్పించుకున్నది. అక్కడున్న ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి తనను కిడ్నాప్ చేసినట్లు చెప్పింది. స్పందించిన ఆటో డ్రైవర్లు, సిర్కాళి మహిళా పోలీస్ స్టేషన్లో ఆ బాలికను అప్పగించారు. అక్కడి పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
అయితే కారు నుంచి బాలిక దిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి మరికొంత దూరం ప్రయాణించాడు. ట్రేస్ చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. కారులో బాలిక ఉన్నప్పటికీ ఆ వాహనాన్ని చోరీ చేయడం వెనుక నిందితుడి ఉద్దేశం ఏమిటి? బాలిక కిడ్నాప్ కోసం అతడు ప్రయత్నించాడా? ఈ నేరంలో ఇతర వ్యక్తుల పాత్ర ఉన్నదా? అన్నది నిర్ధారించేందుకు నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
Reading Vs Listening | వినడం లేదా చదవడం.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది..?
Library | గ్రంథాలయంలో నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం
Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

