Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Wall Collapse | నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ కుప్పకూలిపోవడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Wall Collapse | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగా లేక వాటి దుస్థితి ఎలా ఉందో తెలియజేసే మరో ఘటన ఇది. తాజాగా మరో ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలింది. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ కుప్పకూలిపోవడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 4వ తరగతి విద్యార్థులు కార్తికేయ కాలు విరిగి తీవ్ర గాయాలు కాగా.. రాజేశ్ అనే మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు విద్యార్థులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎక్కువమంది విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు
కాంపౌండ్ వాల్ కూలడంతో 4వ తరగతి విద్యార్థులు కార్తికేయ కాలు విరిగి తీవ్ర గాయాలు కాగా రాజేశ్ అనే విద్యార్థికి సైతం గాయాలు
వెంటనే స్పందించి విద్యార్థులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్న సిబ్బంది, స్థానికులు
ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

