Apprentice | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ (BSP) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా 710 ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు కంపెనీ పోర్టల్ ద్వారా ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
1) ట్రేడ్ అప్రెంటిస్ (ITI)లు 516
ఎలక్ట్రీషియన్- 95
ఫిట్టర్- 80
మల్టీమీడియా అండ్ యానిమేషన్ స్పెషల్ ఎఫెక్ట్- 9
టెక్నీషియన్ మెకానిక్స్- 20
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 20
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్- 25
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 35
మెషినిస్ట్- 25
ట్యూనర్- 15
వెల్డర్- 15
ICTSM- 15
AOCP- 15
డీజిల్ మెకానిక్-15
టూల్ అండ్ డై మేకర్- 10
LACP- 10
మెకానిక్ మోటార్ వెహికల్- 10
మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ- 20
సెంట్రల్ ఏసీ ప్లాంట్ మెకానిక్- 16
ఉడ్ వర్క్ టెక్నీషియన్- 10
స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (హిందీ)- 10
స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్)- 10
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్- 10
హాస్పిటల్ హౌస్ కీపింగ్- 6
మాసన్- 10
ఐటీ- 10

Posts
2) డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్లు 124
సెరామిక్ టెక్నాలజీ- 2
కెమికల్- 2
సివిల్- 10
కంప్యూటర్ సైన్స్- 5
ఈఈఈ- 5
ఎలక్ట్రికల్- 10
మెకానిక్/మెకాట్రానిక్స్- 10
మెటలర్జీ- 20
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 10
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 5
ఆటోమొబైల్స్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 8
డిప్లొమా ఇన్ నర్సింగ్ (GNM)- 5
డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ- 5
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ- 5
డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ టెక్నాలజీ- 5
డిప్లొమా ఇన్ ఎక్స్ రే టెక్నాలజీ- 5
డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ- 2
డిప్లొమా ఇన్ ఫార్మసీ- 5
3) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 70
సెరామిక్ టెక్నాలజీ- 2
కెమికల్- 2
సివిల్- 5
కంప్యూటర్ సైన్స్- 2
ఈఈఈ- 2
ఎలక్ట్రికల్- 2
మెకానిక్/మెకాట్రానిక్స్- 2
మెటలర్జీ- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 2
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
ఆటోమొబైల్స్- 2
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 2
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్- 5
ప్రొడక్షన్- 5
బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (BA)- 5
B.Sc- 3
B.Com- 5
BCA- 5
BBA- 5
బీఎస్సీ నర్సింగ్- 5
డేటా ఎంట్రీ ఆపరేటర్- 2

Apprentice
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ట్రేడ్లను బట్టి సంబంధిత కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎమ్, డీఎమ్ఎల్టీ, డీఆర్టీ తదితర కోర్సులను 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో పాసైనవారు అర్హులు.
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి వయస్సు కనీసం 18 నుంచి 28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక
అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదో తరగతి మార్కులకు 30 శాతం, ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తారు.
స్టైపెండ్ నెలకు ట్రేడ్ అప్రెంటిస్లకు రూ. 9,600, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్లకు రూ. 10,900, గ్రాడ్యుయేట్ అప్రెంటిసల్కు రూ. 12,300 ఇస్తారు.
http://apprenticeshipindia.org, https://nats.education.gov.in పోర్టల్లో అక్టోబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అక్టోబర్ 27 నుంచి నవంబర్ 21 వరకు వాక్ ఇన్ నిర్వహిస్తారు.
అడ్రస్- రూమ్ నంబర్ 123, HRDC భిలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్, 490001