మనం చేసే రోజువారీ పనుల్లో అత్యంత రొటీన్ది ఏంటంటే పళ్లు తోముకోవడం. నిద్రలేవగానే తొలిగా చేసే ఈ పని కోసం పిల్లలు మాత్రం బాగా మారాం చేస్తారు. కానీ దాన్ని కూడా సరదాగా మార్చేలా… బొమ్మల రూపంలో ‘బ్రష్ హోల్డర్లు’ రూపొందుతున్నాయి. బ్రష్, పేస్ట్లను ఇందులో పెట్టుకోవచ్చు. కుక్క, పిల్లి, బాతు, కప్ప, ఎండ్రకాయ… ఇలా రకరకాల జంతువుల ఆకారాల్లోవీ, ముద్దు ముద్దు బొమ్మల్లా కనిపించేవీ వీటిలో ఉంటున్నాయి.
పఫ్లు, పండ్ల రూపాలతో పాటు, కార్టూన్ క్యారెక్టర్లనూ వీటిలో తయారు చేస్తున్నారు. ‘ఊహూ… పళ్లు తోముకోనంటే తోముకోను…’ అని మొండికేసే పిల్లలు కొద్ది రోజులైనా సరదాగా ఆ పని చేసేందుకు ఉపయోగపడతాయివి. అంతేకాదు, బొమ్మలు అలంకరించినట్టుగా ఉండి బాత్రూంకీ కొత్త కళ తెస్తాయి.