చండూర్ సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు.. 9 నుంచి 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
Chandur Farmers | విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు మంగళవారం ముట్టడించారు.
చిలిపిచెడ్, అక్టోబర్ 7: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు మంగళవారం ముట్టడించారు. వరి పంటలు చివరి దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో లో-వోల్టేజీతోపాటు తరచూ ట్రిప్పింగ్ జరుగుతోందని రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో సాగునీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. రోజుకు 9 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
సమస్యను ఇప్పటికే ఏఈ, ఏఈడీల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. విద్యుత్ సమస్య కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

