అమరావతి : ఏపీలోని అనకాపల్లి ( Anakapalli District ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను ( Couple Died ) గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎలమంచిలి మండలం పులపర్తి సమీపంలో దంపతులు పాపారావు (50), అచ్చియమ్యమ (40) పొలపనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.