వార్మప్ చేయండి: సమయం లేదనే సాకుతో నేరుగా వెయిట్స్ ఎత్తేయడం చాలామంది చేసే పెద్ద పొరపాటు. బిగుతుగా ఉండే కండరాలతో వ్యాయామం చేస్తే గాయాలు అయ్యే ప్రమాదం ఎకువగా ఉంటుంది. అందుకే ప్రధాన వర్కవుట్ ప్రారంభించే ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రిస్ వాకింగ్, ఆర్మ్ సరిల్స్, బాడీవెయిట్ స్వాట్స్ వంటి తేలికపాటి వ్యాయామాలతో శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.
సరైన ఫామ్‌లో: ప్రాథమిక సూత్రాలు పాటించకుండా శరీరం తట్టుకోలేనంత ఎకువ బరువులు ఎత్తితే నడుము, భుజాలు, మోకాళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. భంగిమ సరిగ్గా లేకపోతే దీర్ఘకాలిక గాయాల బారిన పడతారు. చివరి కొన్ని రిపిటీషన్లలో మీ భంగిమ తప్పుతోందంటే, ఆ రోజుకి ఆ బరువు మీ శరీరంపై ఎకువ ఒత్తిడి తెస్తోందని అర్థం చేసుకోవాలి.
విశ్రాంతి తీసుకోండి: వ్యాయామం చేసేటప్పుడు కండరాలు పెరగవు. వరవుట్ పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో మాత్రమే రిపెయిర్ అవుతాయి. వారంలో 7 రోజులూ విశ్రాంతి లేకుండా వ్యాయామం చేస్తే తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి కనీసం 1 లేదా 2 రోజులు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఆ రోజుల్లో తేలికపాటి వాకింగ్ లేదా స్ట్రెచింగ్ మాత్రమే చేయాలి.
నిర్లక్ష్యం చేయొద్దు: కండరాలు కోలుకోవడంలో నిద్ర అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే జిమ్‌కి వెళితే శరీరానికి తగినంత కోలుకునే సమయం లభించదు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే శక్తి తగ్గిపోవడమే కాకుండా మూడ్, ఆకలి, తర్వాతి వరవుట్ పనితీరు దెబ్బతింటాయి. కండరాల బలానికి రోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి.
సరైన ఆహారం: కొందరు ఖాళీ కడుపుతో వరవుట్లు చేసి ఆ తర్వాత కూడా గంటల తరబడి ఆహారం తీసుకోరు. మరికొందరు కేలరీలను దారుణంగా తగ్గించే క్రాష్ డైట్లు పాటిస్తారు. ఈ రెండూ శరీరాన్ని బలహీనపరుస్తాయి. పప్పుధాన్యాలు, పనీర్, గుడ్లు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, చికెన్ వంటి ప్రొటీన్లతో పాటు అవసరమైన కార్బోహైడ్రేట్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకోవడం వల్ల వర్కవుట్ ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.
ఇతరులతో పోల్చుకోవద్దు: నెలల తరబడి ఒకే రకమైన వ్యాయామాలు చేస్తే శరీరం దానికి అలవాటుపడి మార్పులు ఆగిపోతాయి. క్రమంగా వ్యాయామాల శైలిని మారుస్తూ ఉండాలి. అందరి శరీర తత్వం, జీవనశైలి ఒకలా ఉండవు. కాబట్టి ఇతరులను అనుకరించకుండా మీ శరీరానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలి.