కోల్‌కతా: మూడు రోజుల కిందట బ్రెజిల్ చేతిలో ఓడిన ఆతిథ్య జట్టు ఇప్పుడు మరో టాప్ టీమ్ ముందు తలవంచింది. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీకి ఉరుగ్వే స్టార్ నూనెజ్ గోల్ కొట్టగా. 22వ నిమిషంలో అనిరుధ్ థాపా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు.
కానీ, 28వ నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు అరౌజో క్లోజ్ రేంజ్ నుంచి గోల్ చేసి ఉరుగ్వేను మళ్లీ ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయినా తిరిగి మొదలైన తర్వాత ఉరుగ్వే ఆటగాళ్లు వరుస గోల్స్‌తో చెలరేగారు.