న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఎక్స్ ఫోల్డ్ 6, వీ80, ఎస్2 ఎఫ్ఈ పేరిట మంగళవారం ఈ మొబైల్స్‌ను పరిచయం చేసింది. ఈ నెల 13 నుంచి వీ80, ఎక్స్ ఫోల్డ్ 6.. 20 నుంచి ఎస్2 ఎఫ్ఈ సేల్స్ మొదలవుతాయి. వీ80 ప్రారంభ ధర రూ.62,999 (8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ). 256జీబీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్లూ ఉన్నాయి. డిస్ప్లే 6.59 అంగుళాలు. అలాగే ఎక్స్ ఫోల్డ్ 6 ప్రారంభ ధర రూ.2,19,999 (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ). 8.02 అంగుళాల మెయిన్ డిస్ప్లే ఉంటుంది.
ఇక ఎస్2 ఎఫ్ఈ ప్రారంభ ధర రూ.38,999 (6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ). 8జీబీ ర్యామ్లోనూ దొరుకుతుంది. డిస్ప్లే 6.57 అంగుళాలు. కాగా, వీ80, ఎక్స్ ఫోల్డ్ 6 మాడళ్లు ఆరిజిన్ ఓఎస్ 7పై నడుస్తాయి. ఎస్2 ఎఫ్ఈ ఆరిజిన్ ఓఎస్ 6పై రన్ అవుతుంది. కెమెరా సామర్థ్యం మాడల్‌ను బట్టి 50 మెగాపిక్సల్ నుంచి 200 మెగాపిక్సల్ వరకు ఉన్నది. వివో వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ ఔట్లెట్లలో లభిస్తాయి. ఇదిలావుంటే వివో తమ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్నూ తెచ్చింది.