హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్ ప్రోత్సహంతో నల్గొండ మండలం కన్సన్ పల్లికి చెందిన యువ సైక్లిస్ట్ రమ్య సత్తా చాటుతోంది. తన ప్రతిభ, ఆసక్తి గుర్తించి కేటీఆర్ బహుమతిగా అందించిన ఆధునిక ట్రాక్ సైకిల్ తోనే కఠిన శిక్షణ పొందిన రమ్య అస్మితా ఖేలో ఇండియా సైక్లింగ్ ట్రయల్స్ లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
దాంతో నేషనల్ చాంపియన్షిప్నకు అర్హత సాధించింది. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. తాను అందించిన చిన్న ప్రోత్సాహం రమ్య ఉన్నత స్థానానికి చేర్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేరొన్నారు. ఆమె నేషనల్ చాంపియన్ అవ్వాలని ఆకాంక్షించారు.