Buldozer Demolition | సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. మరోసారి ఇండ్లపైకి దూసుకొచ్చిన జేసీబీలు
Buldozer Demolition | సీఎం ఇలాకాలో మరోసారి ఇండ్లపైకి బుల్డోజర్లు గర్జించాయి. కోస్గిలో బాధితులు ఇండ్లలో ఉండగానే కూల్చివేతకు దిగాయి. నోటీసులేవీ ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని వస్తువులు తీసుకునే అవకాశమూ ఇవ్వకుండా కూల్చివేతలకు దిగాయి. కన్నీటిపర్యంతమైన బాధితులు సర్కార్‌కు శాపనార్థాలు పెట్టారు.
Buldozer Demolition | కోస్గి, అక్టోబర్ 6 : రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలోకి మరోసారి బుల్డోజర్లు దూసుకొచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున ఎవరూ నిద్ర లేవకముందే దుకాణాలు, ఇండ్లపైకి జేసీబీలు దండెత్తాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. నివాసాలను కూల్చివేశారు. న్యాయస్థానాల ఆదేశాలను అపహాస్యం చేస్తూ అధికారులు వికటహాసం సాగించారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీస్ రాజ్యం కొనసాగించారు. మహిళలు అనే కనికరం కూడా లేకుండా పోలీసులు కాఠిన్యాన్ని ప్రదర్శించారు. వృద్ధులు, యజమానులు, వారి కుటుంబ సభ్యులు కంట కన్నీరు పెడుతున్నా అధికారుల మనసు కరుగలేదు. దీనికితోడు ప్రతిపక్ష నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితులకు అండగా నిలిచిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఉలిక్కిపడ్డ కోస్గి..
కోస్గి పట్టణంలోని శివాజీ కూడలిలో చౌరస్తా విస్తీర్ణం పేరుతో మంగళవారం 17 వ్యాపార సముదాయాలను కూల్చివేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూల్చివేతలపై కనీసం సమాచారం ఇవ్వలేదు. తెల్లవారుజామునే మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది శివాజీ కూడలికి చేరుకుని వ్యాపారులను, వారి కుటుంబీకులను నిద్రలేపి ‘మీ ఇండ్లు, దుకాణాలు ఖాళీ చేయాలి’ అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితులకు ఏం చేయాలో పాలుపోలేదు. అకస్మాత్తుగా చెబితే ఎలా ఖాళీ చేయాలని కొందరు ప్రశ్నించారు. మరికొందరు తమకు కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్లు ఉన్నాయంటూ మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు విన్నవించారు. ఎవరేమి చెప్పినా వినేది లేదని.. ఇది ప్రభుత్వ ఆదేశమని కమిషనర్ చెప్పారు.. గంటలోగా నివాసాలను ఖాళీ చేయాలని చెప్పి వెళ్లారు. కొందరు అధికార పార్టీ నాయకులకు ఫోన్లు చేసినా స్పందన లేకుండాపోయింది. తరువాత రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పోలీస్ బలగాల మధ్య నాలుగు జేసీబీలతో కూల్చివేతలు మొదలుపెట్టారు.

కొందరు బాధితులు తాము ఖాళీ చేసేది లేదని భీష్మించి కూర్చోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అయినా అధికారులు లెక్క చేయకుండా వారిని బలవంతంగా ఖాళీ చేయించి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా కరుణ చూపలేదు. కిరాణా దుకాణాన్ని కూల్చేందుకు జేసీబీతో వెళ్లగా.. సదరు యజమాని అడ్డు వచ్చాడు. ‘20 ఏండ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం.. మాకు ఆధారం లేదు అని మహిళ వేడుకున్నా ఆగలేదు. ముందు భాగం కూల్చివేసి మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలి’ అని హుకుం జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి పలువురు మహిళలు శాపనార్థాలు పెట్టారు. ‘సీఎం.. అసలు ఉన్నావా? సచ్చినావా?’ అంటూ పలువురు రేవంత్‌ను దుమ్మెత్తిపోశారు. ‘నీకు కుటుంబం లేదా? నీకు పిల్లలు లేరా?. వయస్సు మీద పడ్డ మహిళలు, ఆడపిల్లలు అని చూడకుండా ఇండ్లను కూల్చిన నీకు మా ఉసురు తగిలిపోతావు’ అని ఏడుస్తూ శాపనార్థాలు పెట్టారు. బాధితులు కంట నీరు పెట్టిన దృశ్యాలు అక్కడి వారిని కదిలించాయి.

కమిషనర్‌కు శిక్ష తప్పదు
కోస్గిలో కూల్చివేతలు జరుగుతున్నాయన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్ నర్సింహులు అన్నారు. తాము నిద్రలేవక ముందే ఇంటికి చేరుకుని, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పలేదని మండిపడ్డారు. గతంలో ఓ మున్సిపల్ కమిషనర్ న్యాయస్థానం ఆదేశాలను లెక్కచెయ్యకుండా ఓ భవనాన్ని కూల్చి వేసి జైలు శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు. ప్రస్తుత కమిషనర్ కూడా ఎవరినీ లెక్కచెయ్యకుండా న్యాయస్థానం ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ కూల్చి వేతలు చేపడుతున్నారని ఆరోపించారు. కమిషనర్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

