ECIL | హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) రిక్రూట్మెంట్ 2026లో భాగంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 310 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. ఈసీఐఎల్ వెబ్సైట్లో అక్టోబర్ 11 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ట్రేడులవారీగా ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 86
ఫిట్టర్- 87
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 41
మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్)- 5
టర్నర్- 8
వెల్డర్- 16
మెషినిస్ట్- 7
మెషినిస్ట్ (G)- 2
పెయింటర్- 2
ఎలక్ట్రీషియన్- 50
కార్పెంటర్- 2
ప్లంబర్- 2
డీజిల్ మెకానిక్- 2

Ecil Posts
అర్హతలు
సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థలో అప్రెంటిస్ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం చేస్తున్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు.
వయస్సు
అక్టోబర్ 31 నాటికి అభ్యర్థుల వయసు 25 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 28, ఎస్సీ, ఎస్టీలకు 30 ఏండ్లలోపు ఉండాలి. దివ్యాంగులకు 10 ఏండ్ల వరకు సడలింపు ఉంది.
ఎంపిక
ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ హైదరాబాద్ అడ్రస్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (MSDE)కు చెందిన www.apprenticeshipindia.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఈసీఐఎల్ వెబ్సైట్ https://www.ecil.co.in లో దరఖాస్తు సమర్పించాలి.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపికైనవారికి స్టైపెండ్ ట్రేడులను బట్టి రూ. 8,050, రూ. 7,700 ఇస్తారు.

Apprentice