KPSC recruitment case: కేపీఎస్సీ రిక్రూట్మెంట్ కేసులో చైర్మెన్ శివశంకరప్ప, సభ్యురాలు బీవీ గీత అరెస్టు
KPSC recruitment case: కర్నాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్ శివశంకరప్ప ఎస్ షౌకార్, కేపీఎస్సీ సభ్యురాలు బీవీ గీతలను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో శివశంకరప్ప ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది. వెటర్నరీ పోస్టుల రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ఈడీ చర్యలు తీసుకున్నది.
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన కర్నాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్ శివశంకరప్ప ఎస్ షౌకార్, కేపీఎస్సీ సభ్యురాలు బీవీ గీతలను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో శివశంకరప్ప ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది. కేపీఎస్సీ రిక్రూట్మెంట్ కేసు(KPSC recruitment case)లో సస్పెండ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్, కేపీఎస్సీ మాజీ ఎగ్రామ్ కంట్రోలర్ జ్ఞానేంద్ర కుమార్ గంగావర్ను కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే రాజకీయ కార్యకర్త బసవరాజ్ కన్నాలేను కూడా ఈడీ విచారించింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ బెంగుళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు.
మంగళవారం ఉదయం శివశంకరప్ప ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను రాత్రి అదుపులోకి తీసుకున్నారు. డాలర్స్ కాలనీలో ఉన్న బీవీ గీతను మరో ఈడీ బృందం అదుపులోకి తీసుకున్నది. శివశంకరప్ప సమీప బంధువు, పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన సుగురేశ్ అనే వ్యక్తి నుంచి ఈడీ స్టేట్మెంట్ తీసుకున్నది. సుగురేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా శివశంకరప్పను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనవరి 8వ తేదీన పశువైద్య శాఖలో 400 ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులకు జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడం, ఆ తర్వాత ఉద్యోగం కోసం డబ్బులు, ఇంటర్వ్యూ సమయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. అయితే పరీక్షకు ముందు రోజు రాత్రి శివశంకరప్ప ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కలిగి ఉన్న శివశంకరప్ప.. 2019లో కేపీఎస్సీ సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత 2021లో చైర్మెన్ అయ్యారు.
ఆయనపై మరో కేసు కూడా ఉన్నది. తప్పుడు ఆదాయ పత్రాలతో శివశంకరప్ప కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కర్నాటక హైకోర్టు ఆయన్ను తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో క్యాబినెట్ ఆయన్ను చైర్మెన్ పదవి నుంచి తప్పించింది. 400 వెటర్నరీ ఆఫీసర్ల నియామకాల కేసులో సీఐడీ ఆయనపై దర్యాప్తు చేపట్టింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో మధ్యవర్తుల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ స్కామ్‌లో జరిగిన మనీల్యాండరింగ్ కోణాన్ని కూడా ఈడీ విచారిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

