Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీద్ ఖండించారు. అక్తర్ తన పేరును రామ్ పాల్గా మార్చుకోవాలన్నారు.
ముంబై: మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్(Javed Akhtar) అన్నారు. రామాయణ్ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీద్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. జావెద్ అక్తర్ ఉద్దేశాన్ని ఆయన వ్యతిరేకించారు. అక్తర్ తన పేరును రామ్ పాల్గా మార్చుకోవాలని సూచించారు. గతంలో షారూక్ ఖాన్ నటించిన స్వదేశీ చిత్రంలో రాముడిపై జావెద్ అక్తర్ పల్ పల్ హై బారీ అనే ఓ సాంగ్ రాశాడు. మనసులో నుంచి రావణుడిని తీసివేస్తే , ఆ వ్యక్తి మనసులో రాముడు ఉంటాడని ఆ పాటలో ఓ చరణం ఉంటుంది. ఆ సాంగ్ గురించి వివరిస్తూ రాముడి గుర్తింపు అనేది మతాలకు సంబంధం లేనిదన్నారు. రాముడు ఓ వ్యక్తి మాత్రమే కాదు అని, రాముడు అమరుడని, రాముడు ఓ జీవనశైలి అని, రాముడి ఆలోచనలో, ఆయనలో నైతికత ఉందన్నారు. రాముడి వైభవాన్ని కీర్తిస్తూ.. ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని, వాళ్లు ఏ మతం వారైనా, ఆయనో జీవనశైలి అన్నారు.
అక్తర్ చేసిన వ్యాఖ్యలను ముస్లిం నేత రషీద్ ఖండించారు. వాణిజ్య లాభాల కోసం బాలీవుడ్ రచయిత ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. జావెద్ అక్తర్ ఓ వ్యాపారవేత్త అని, బాలీవుడ్లో పాటల్ని అమ్ముకుంటారని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకుంటే, ఆయన పాటల్ని ఎవర్ని కొంటారని ముస్లిం నేత రషీద్ అన్నారు. అనేక సందర్భాల్లో నాస్తికుడిని అని జావెద్ అక్తర్ చెప్పుకున్నారని, ఆయన మతాన్ని నమ్మరని రషీద్ అన్నారు. నాస్తికుడైన అక్తర్ ఇప్పుడు రాముడిపై విశ్వాసాన్ని చూపుడుతున్నాడని, అందుకే ఆయన తన పేరును రామ్ పాల్గా మార్చుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పాడు. మీరు పేరు మార్చుకుంటే 80 శాతం మంది హిందువులు మీకు పూర్తి గౌరవం, మర్యాద ఇస్తారని రషీద్ కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
Congress | పెన్ పహాడ్ కాంగ్రెస్లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’.. సీనియర్ నేత బహిరంగ లేఖాస్త్రం!
Sakshi Dhoni | ‘కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !
Lateef Bhat: లష్కరే ఉగ్రవాదితో వీడియో కాల్.. లొంగిపోయేందుకు లతీఫ్ భట్ నిరాకరణ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

