Congress | పెన్ పహాడ్ కాంగ్రెస్లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’.. సీనియర్ నేత బహిరంగ లేఖాస్త్రం!
Congress | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినా గుర్తింపు దక్కడం లేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ‘
Congress | పెన్ పహాడ్, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినా గుర్తింపు దక్కడం లేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా? ఆర్థిక స్థోమత లేదనే నిర్లక్ష్యమా?’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తమ గ్రామానికి చెందిన నాతాల వెంకట్రామిరెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని శ్రీరాములు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. గతంలో తాను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తన అభిమాన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడానికి కారణమేంటని ప్రశ్నించారు.
పార్టీలో తనను పక్కనపెట్టడానికి కారణాలేంటని శ్రీరాములు ప్రశ్నించారు. తాను బీసీ నాయకుడిననే చిన్నచూపా? ఆర్థిక స్థోమత లేదనే నిర్లక్ష్యమా? లేక ఇతర నాయకులతో తనకున్న సాన్నిహిత్యంపై అపోహలా? అంటూ లేఖలో తన మనసులోని బాధను బయటపెట్టారు. తనకు ఎలాంటి గ్రూపులు లేవని, పార్టీలో అందరితో కలిసిమెలిసి ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు.
రాజకీయంగా తనను పక్కనపెట్టడమే కాకుండా ప్రభుత్వ పథకం విషయంలోనూ అన్యాయం జరిగిందని శ్రీరాములు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా ఆర్థికంగా ఎదగలేకపోయానని, కనీసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వ పథకం విషయంలోనూ ప్రాధాన్యం దక్కకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఒకప్పుడు పెన్ పహాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఉండేదని, ప్రస్తుతం అది వెయ్యి ఓట్లకు పడిపోయిందని శ్రీరాములు లేఖలో ప్రస్తావించారు. పార్టీ బలహీనపడటానికి అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు కూడా కారణమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాయకుల మధ్య విభేదాలు పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలని సర్వోత్తం రెడ్డిని కోరారు. వ్యక్తిగత వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించేనా?
పెన్ పహాడ్ మండల కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి ఈ లేఖతో తెరపైకి వచ్చాయి. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకే గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం కావడం స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పార్టీ పదవులు, ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలకు ప్రాధాన్యం, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లేఖపై రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, పార్టీ ముఖ్య నాయకత్వం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | పెన్ పహాడ్ కాంగ్రెస్లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’.. సీనియర్ నేత బహిరంగ లేఖాస్త్రం!
Sakshi Dhoni | ‘కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !
Lateef Bhat: లష్కరే ఉగ్రవాదితో వీడియో కాల్.. లొంగిపోయేందుకు లతీఫ్ భట్ నిరాకరణ
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

