Lateef Bhat: లష్కరే ఉగ్రవాదితో వీడియో కాల్.. లొంగిపోయేందుకు లతీఫ్ భట్ నిరాకరణ
Lateef Bhat: లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ ఎదురుకాల్పుల్లో ట్రాప్ అయ్యాడు. సీఆర్పీఎఫ్ చెక్ పాయింట్‌పై దాడి కేసులో భట్ ప్రధాన నిందితుడు. ఓ మసీదులో అతను దాక్కున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఇవాళ ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్(Lateef Bhat) ఆ ఎదురుకాల్పుల్లో ట్రాప్ అయ్యాడు. నవంబర్ 11వ తేదీన సీఆర్పీఎఫ్ చెక్ పాయింట్‌పై దాడి జరిగిన కేసులో భట్ ప్రధాన నిందితుడు. ఓ మసీదులో అతను దాక్కున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఉగ్రవాది భట్‌కు పోలీసులు వీడియో కాల్ చేశారు. సరెండర్ కావాలని అడిగారు. మేం నీతోనే ఉన్నామని ఓ అధికారి అన్నారు. కానీ లొంగిపోయేందుకు భట్ అంగీకరించలేదు. నాకు అల్లాను కలవాలని ఉందని, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆ ఉగ్రవాది తెలిపాడు.
మసీదులో దాక్కున్న లతీఫ్ .. తమపై ఫైరింగ్ చేస్తున్నాడని భద్రతా బలగాలు తెలిపాయి. భట్‌తో పాటు దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్‌ను సోమవారమే హతమార్చారు. సీఆర్పీఎఫ్ చెక్‌పాయింట్‌పై దాడి చేయడానికి ముందే దార్‌తో పాటు భట్ కూడా రెక్కీ గీసినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా గుర్తించారు. అప్పటి నుంచి భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సుమారు 500 మంది అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.
#WATCH | Jammu and Kashmir: Encounter underway between security forces and terrorists in Kulgam
(Visuals deferred by unspecified time; no live operational details disclosed) https://t.co/0yOyqgsmhM
— ANI (@ANI) November 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lateef Bhat: లష్కరే ఉగ్రవాదితో వీడియో కాల్.. లొంగిపోయేందుకు లతీఫ్ భట్ నిరాకరణ
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Bigg Boss 10 | మాజీ కంటెస్టెంట్లతో హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు.. ముకేష్‌పై త్రిగుణ్ ఫైర్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

