Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Russian Plane Crash | రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russian Plane Crash | రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ అక్కడి ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది.
రష్యాకు చెందిన ఏఎన్-12 (An-12) సైనిక రవాణా విమానం నియమిత ప్రయాణంలో ఉండగా కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో కూలిపోయింది. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ గవర్నర్ ఇల్యా సెరెద్యుక్ తెలిపారు. పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇతరుల రాకపోకలను నిలిపివేశారు. దర్యాప్తు కోసం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. హెలికాప్టర్‌తో పాటు వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్లు గవర్నర్ వెల్లడించారు.
విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రష్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో ఏదైనా సరుకు ఉందా? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
కాగా, విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశం నుంచి ఓ వెలుగుతున్న వస్తువు వేగంగా కిందకు పడిపోవడం, ఆ వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతం ఒక్కసారిగా వెలిగిపోయింది. అయితే విమానం కూలిన ప్రదేశం దూరంగా ఉండటంతో ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అందులో కనిపించలేదు.
BREAKING:
🇷🇺 A Russian military AN-12 transport aircraft crashed near the city of Kemerovo in the Kemerovo oblast, killing all on board. https://t.co/FiSUP6ZpZt
— Megatron (@Megatron_ron) November 17, 2026
ఏఎన్-12 విమానం ప్రత్యేకతలివే..
ఏఎన్-12 (Antonov An-12) అనేది సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన నాలుగు ఇంజిన్ల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అభివృద్ధి చేసిన ఈ విమానాలను ప్రధానంగా సైనికులు, ఆయుధాలు, భారీ పరికరాలు, ఇతర సరుకుల రవాణాకు ఉపయోగిస్తారు. వివిధ రకాల విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఈ విమానాలకు ఉంది. రష్యా సైన్యం వీటిని సైనిక రవాణాతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాల్లోనూ వినియోగిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
Congress | పెన్ పహాడ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’.. సీనియర్ నేత బహిరంగ లేఖాస్త్రం!
Sakshi Dhoni | ‘కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !
Lateef Bhat: లష్కరే ఉగ్రవాదితో వీడియో కాల్.. లొంగిపోయేందుకు లతీఫ్ భట్ నిరాకరణ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

