SIR | భారత్లో ప్రమాదంలో ఓటు హక్కు.. 13 కోట్ల ఓట్లకు ‘సర్’ ఎసరు.. ది న్యూయార్క్ టైమ్స్ కథనం
SIR | ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రమాదంలో పడింది. ఓటు హక్కు కలిగి ఉండాలంటే మీరు కొన్ని పత్రాలు చూపించి రుజువు చేసుకోవాల్సిన దుస్థితి దేశంలోని 100 కోట్ల పౌరులకు పట్టింది.
SIR |న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రమాదంలో పడింది. ఓటు హక్కు కలిగి ఉండాలంటే మీరు కొన్ని పత్రాలు చూపించి రుజువు చేసుకోవాల్సిన దుస్థితి దేశంలోని 100 కోట్ల పౌరులకు పట్టింది. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, విదేశీయుల ఓట్ల తొలగింపు పేరుతో చేపట్టిన ఈ ఓట్ల ప్రక్షాళన కార్యక్రమం ఏకంగా పౌరుల ఓటు హక్కుకే ఎసరుపెట్టింది. ఇలా ఇప్పటివరకు 13 కోట్లకు పైగా ఓటర్లను జాబితాల నుంచి తీసేశారు. కాదు.. కాదు అపహరించారు’.. ఈ మేరకు ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏడు దశాబ్దాల నాటి భారత ఎన్నికల సమగ్రత దెబ్బతింది. ఓటర్ల జాబితా మునుపటి సవరణలు డోర్ టు డోర్ విచారణ జరిపి భౌతికంగా ఉండేవి. అయితే ప్రస్తుత విధానంలో నిరూపణ బాధ్యత పూర్తిగా పౌరులపైనే మోపారు.
సరిగ్గా నిరూపించుకోలేక పోయారా? మీ ఓటు తొలగిస్తాం అంటున్నారు. దీంతో పౌరుడికి ఓటు హక్కు ఉండటం, పోవడం అనేది అల్గారిథమ్స్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది. ఇక క్లరికల్ ఎర్రర్స్, పాత రికార్డులలో తప్పులు వంటివి ఉన్నా దానికి అంతిమంగా బలయ్యేది ఓటరే. ఏ మాత్రం చిన్న కారణం దొరికినా ఓటర్లను వదిలించుకోవడమే ప్రధాన లక్ష్యం, ప్రయత్నంగా ప్రస్తుత ప్రక్రియ కనిపిస్తున్నదని మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస పేర్కొన్నారు. మోదీ హిందూ జాతీయవాద పార్టీకి మద్దతు ఇవ్వరేమోన్న అనుమానం ఉన్న వారి ఓటు హక్కును ఈ ప్రక్రియ నిర్దాక్షిణ్యంగా లాగేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

