ఉపాధ్యాయుల కొరత.. వాలంటీర్లకు సర్పంచులే జీతాలు..!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో.. సమస్యను అధిగమించేందుకు గ్రామ సర్పంచులు, గ్రామస్తులే ముందుకొస్తున్నారు.
మాగనూరు, అక్టోబర్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో.. సమస్యను అధిగమించేందుకు గ్రామ సర్పంచులు, గ్రామస్తులే ముందుకొస్తున్నారు. మాగనూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా ఉండేందుకు సొంత నిధులతో విద్యా వాలంటీర్లను నియమించుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నారు.
మందిపల్లి, అమ్మపల్లి, పరమందొడ్డి, పెగడబండ, పుంజనూరు, గురురావులింగంపల్లి, తాళంకేరి, బైరంపల్లి తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొన్నదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉన్నప్పటికీ.. అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి సొంత నిధులతో విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారు. పాఠశాలల్లో బోధన కొనసాగేందుకు వారికి నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించలేని పరిస్థితి ఉంటే.. కనీసం అవసరమైన విద్యా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఎందుకు వచ్చిందని పలువురు సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
మందిపల్లి పాఠశాలలో మంగళవారం సర్పంచ్ రఘు, వార్డు సభ్యుల సహకారంతో ఇద్దరు విద్యా వాలంటీర్లకు నెల జీతాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మాగనూరు మండలంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, అక్కడ అవసరమైన మేరకు విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సర్పంచులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు.. ఉపాధ్యాయుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

