NRI | లండన్: లండన్లో ఎన్నారై బీఆర్ఎస్ (NRI BRS) యూకే కార్యవర్గ సమాశం అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే సభ్యుడు శ్రీనాథ్ రెడ్డి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం అటు అమరవీరులను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించారు. యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ఎన్నారైలు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యదర్శి సురేశ్ గోపతి స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tribute
మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. యూకే (UK)లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమైన విషయమని అన్నారు. కేసీఆర్–కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతోనే పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని నూతన సభ్యులు పేర్కొన్నారు.
నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్–కేటీఆర్ (KCR-KTR) నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజల పక్షాన బలమైన పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. పార్టీ పోరాటాలకు సంఘీభావంగా యూకేలోని ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో లండన్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. 16 సంవత్సరాలుగా లండన్లో ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలను నూతన సభ్యులకు వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తదితర పార్టీ నాయకత్వం ఎన్నారైలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారని అన్నారు. అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రేతినేని రవి కుమార్, సత్యమూర్తి చిలుముల, సతీశ్ రెడ్డి గొట్టెముక్కుల మాట్లాడుతూ.. ఎన్నారైలకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించిన కేసీఆర్కు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటామని అన్నారు. ఏ సమస్య వచ్చినా సంస్థ సభ్యులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజల తరఫున మరింత ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తామని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీకి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యదర్శి– ఐటీ, మీడియా, పీఆర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలను గణాంకాలతో సహా విశ్లేషిస్తూ ప్రశ్నిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’కు పాల్పడుతున్నారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం కన్వీనర్ ప్రశాంత్ మామిడాల ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ డ్రామాలను రానున్న రోజుల్లో ఎండగడతామని అన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మైనారిటీ సెల్ నాయకుడు అబ్దుల్ జఫర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం కో-ఆర్డినేటర్ అమరేశ్వరి అన్నారు. కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేశ్ ఇస్సంపల్లి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమంలో అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, గణేశ్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, ప్రవీణ్ వీర, కార్యదర్శులు అబూ జాఫర్, సురేశ్ గోపతి, కోశాధికారి సురేశ్ బుడగం, లండన్ ఇన్చార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, రాజేశ్ వర్మ, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, శివ గౌడ్, మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇన్చార్జ్ తరుణ్ లునావత్, లావణ్య, సాయి కిరణ్ కనుగుల, సాకేత్, జనార్దన్, స్నేహిత్ రావు, అనిల్ రాచమల్ల, సంకేత్ రెడ్డి, మణీందర్ రెడ్డి, శ్రీహరి, జయపాల్ రెడ్డి, రాజు యాదవ్, అజయ్, రేవంత్, ప్రసన్న కుమార్, వికాస్ పర్రె, రాహుల్, మహేశ్, అశ్వల్, శ్రీకాంత్, అస్లాన్, విజయ్, రమేశ్ హర్షవర్ధన్, సతీశ్ చంద్ర పాల్గొన్నారు.