ముంబై, అక్టోబర్ 6: నూతన స్లావియా నయా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.18.84 లక్షలకు లభించనున్నది. ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో అనుసంధానమైన నెక్ట్స్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 17.7 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 25కి పైగా అదనపు భద్రత ఫీచర్స్ కలిగిన ఈ మాడల్ ఆరు రకాల్లో లభించనున్నది.
ఈ కారుపై నాలుగేండ్ల వ్యారెంటీ, నాలుగేండ్లపాటు రోడ్‌సైడ్ అసిస్టెన్, నాలుగు లేబర్ ఫ్రీ సర్వీసింగ్ ఆఫర్ అందిస్తున్నది.