టెల్ అవివ్: ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కోపైలట్ చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్(Smit Machchhar) పుర్రెకు ఫ్రాక్చర్ అయ్యింది. ఒమన్ దేశానికి చెందిన కోపైలట్ గొడ్డలితో మచ్చర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. 38 ఏళ్ల మచ్చర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆస్పత్రి వర్గాల ప్రకారం అతని పుర్రెకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. యూఏఈకి వెళ్లడానికి ముందే ఈ గాయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పుర్రె పగలడంతో.. ఓ ఎముక ముక్క మెదడు వైపు దూసుకెళ్లింది. దీన్ని చాలా తీవ్రమైన గాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పుర్రె ఎముక లోపలికి వెళ్లి మెదడును గాయపరిచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మెడికల్ కేర్ లేదా సర్జరీ చేయాల్సి ఉంటుంది. కోపైలట్ దాడిలో మచ్చర్ కాళ్లు, ఛాతి, కడుపుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అబూ దాబి ఆస్పత్రిలో అతను చికిత్స నుంచి కోలుకుంటున్నాడు. మిలిటరీ ఆస్పత్రిలో స్పెషల్ డాక్టర్ల బృందం చికిత్స అందిస్తున్నది.