అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( AP High Court ) శాశ్వత న్యాయమూర్తులు ( Permanent Judges ) గా సోమవారం ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వీరిచే ప్రమాణం చేయించారు.
జస్టిస్ తూట చంద్ర ధన శేఖర్, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ఐదుగురిని సీజేతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయ వాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది అభినందించారు.