KTR | కానిస్టేబుల్‌కు అండగా కేటీఆర్.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన శంకర్ వైద్య ఖర్చులు భరిస్తానని భరోసా
KTR | డ్యూటీలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిట్లో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్‌కు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
KTR | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : డ్యూటీలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిట్లో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్‌కు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శంకర్ వైద్యానికి అయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని ఎక్స్ వేదికగా మంగళవారం ప్రకటించారు. బాధితుడు పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి తెలుపాలని పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు.
శంకర్‌ను కుటుంబ సభ్యులు పలు దవాఖానల చుట్టూ తిప్పినా బెడ్ల కొరత, ఈహెచ్ఎస్ సమస్యల కారణంగా సరైన సమయంలో వైద్యం అందలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్‌ను కాపాడుకొనేందుకు బంధువులు, తోటి కానిస్టేబుళ్లు రూ.1.5 లక్షలు సమకూర్చి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనకు మరింత చికిత్స అవసరం కావడంతో సిబ్బంది విరాళాలు సేకరిస్తున్నారు. కానిస్టేబుల్ శంకర్ చికిత్స బాధ్యతను కేటీఆర్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు
ఈహెచ్ఎస్ విఫలంపై ఆర్ఎస్పీ ఆగ్రహం
ఉద్యోగులు, పోలీసులకు ఆరోగ్య భరోసా క ల్పించాల్సిన ఈహెచ్ఎస్ వ్యవస్థ విఫలమైందని ఆర్ఎస్పీ మండిపడ్డారు. శంకర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉన్నతాధికారు లు స్పందించలేదని ఆరోపించారు. తన ట్వీట్‌కు స్పందించి కేటీఆర్ ముందుకొచ్చి వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించిన తర్వాతే అధికారులు మేలొని ఈహెచ్ఎస్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

