ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Jan 23, 2020 , 01:53:06

అప్పుడు ఓటీపీ..ఇప్పుడు క్యూఆర్

అప్పుడు ఓటీపీ..ఇప్పుడు క్యూఆర్సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొత్త సంవత్సరంలో సైబర్ దొంగలు సరికొత్త సైబర్ క్రైంను తెరపైకి తెచ్చా రు. దీని కోసం వారు వ్యాపారస్తులను టార్గెట్ చేస్తున్నారు. వారిని బురిడీ కొట్టించేందుకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నట్లు బుకాయించి దోచేస్తున్నారు. ఈ విధంగా స్వీట్ షాపు మొదలుకుని పెద్ద పెద్ద వ్యాపారులను బురి డీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ మాయగాళ్లు జస్ట్ డయల్ నమోదు చేసుకున్న వ్యాపార నిర్వాహకు లు, సంస్థలను ఎంచుకుంటున్నారు. తాజాగా వస్తున్న ఫిర్యాదులను బట్టీ పోలీసులు వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ జస్ట్ డయల్ డాటా వారి అక్రమ మార్గంలో సంపాధించి అందులో నమోదు చేసుకున్న వారికి భారీ ఆర్డర్ల రూపంలో బోల్తా కొట్టిస్తున్నారు.

50 టీవీలు కావాలి

శివారు ప్రాంతంలో ఓ ఎలక్ట్రీకల్ షాపును నిర్వహిస్తున్న యజమానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నేను హైదరాబాద్ ఉంటాను మీరు నాణ్యమైన ఎలక్ట్రీక్ సామన్లు అమ్ముతారని నా స్నేహితుడి ద్వారా తెలిసింది. అందుకే మీకు ఫోన్ చేశాను. మేము ఓ ఐదు అంతస్తుల భవనంలో ఓ స్టూడియో, ఇంకా కార్పొరేట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. కాబట్టి దాదాపు 50టీవీలు అవసరమున్నాయని చెప్పాడు. దీంతో దుకాణం నిర్వహిస్తున్న యజమాని ఫుల్ అయ్యాడు. పెద్ద ఆర్డర్ దొరికిందనుకుని ఏ కంపెనీ కావాలి, టీవీల సైజు ఎంత ఉండాలి ఇలా అనేక వివరాలను సేకరించాడు. గుర్తు తెలియని వ్యక్తి నేను మీకు అడ్వాన్స్ కింద నగదును పంపిస్తాను.  ఆ తర్వాత నాకు టీవీలు సరఫరా చేయండని గుర్తు తెలియని వ్యక్తి కోరాడు. కొద్దిసేపటి తర్వాత మీకు క్యూఆర్ కోడ్ వచ్చింది దానిని స్కాన్ చేసి కింద బటన్ నొక్కండని చెప్పాడు. ఆర్డర్ మాయలో ఉన్న నిర్వాహకుడు క్యూఆర్ రాగానే స్కాన్ చేసి కింద బటన్ నొక్కాడు. అంతే అతని ఖాతా నుంచి 50 వేలు మాయమయ్యా యి. కంగారుపడి గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేశాడు. అతను అరే మీ డబ్బులు నాకు వచ్చాయా మరో క్యూఆర్ కోడ్ పంపిస్తాను. దానిని నొక్కండి పాత డబ్బులతో కలుపుకుని మీకు లక్ష రుపాయాలు మీ ఖాతాలో చేరుతాయన్నారు. నిజమని నమ్మి దుకాణం యజమాని తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బటన్ నొక్కాడు. మరో 50 వేల రుపాయాలు కూడా వెపోయాయి. ఇది నమ్మిన యజమాని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ అంటే.. పే మాత్రమే

ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ క్యూఆర్ కోడ్ పం పిం చి బురిడి కొట్టిస్తున్నారు. అయితే వీటికి బోల్తా పడుతున్న చాలామంది లక్షలు పోగట్టుకుంటున్నారు. అయితే క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు కేవల పే అని బటన్ పే నొక్కితే డబ్బు వస్తున్నట్లా...పోతున్నట్లా అనే విషయాన్ని మర్చిపోయి అంతకుముందు గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాయలో ఉండిపోయి పే అని కొట్టేస్తున్నారు. దీనికి తోడు సైబర్ క్రిమినల్స్ క్యూఆర్ కోడ్ సొంతంగా సృష్టించుకుని వాటిని పంపిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్లు ముందే క్యూఆర్ పంపిస్తున్న సమయంలోనే ఇంత నగదు మీకు వస్తుందని చెప్పడంతో అదే నగదు బాధితులు క్యూఆర్ స్కాన్ చేసి నగదును ఎం ట్రీ పే అని కొట్టేస్తూ నగదును తన చేతుల మీదుగానే సైబర్ మాయగాళ్లకు పెడుతున్నారు.

గోల్ చేయడానికే...

గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి భారీ అర్డర్ డబ్బులను క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తాను అని చెప్పితే మొదటిగానే అది సైబర్ కాల్ అనుమానించాలి. వెంటనే అతని ఫోన్ కట్ చేయాలి. క్యూర్ స్కాన్ చేసినప్పుడు ఎంటర్ అమౌం ట్ అని వస్తుంది. ఆ తర్వాత పే అని మాత్రమే ఉం టుంది ఇది గమనించాలి. పే అంటే మనం కడుతున్నట్లు గ్రహించాలి. రిసీవ్ అంటే మన కు వస్తున్నట్లు గుర్తించుకోవాలి. ఈ ఏడాది భారీ ఆర్డర్ల రూపంలో జస్ట్ డయల్ రిజిస్టర్ ఉన్న వ్యాపారుస్తులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుం ది. మా దగ్గర ఈ విధంగా మోసపోయిన ఫిర్యాదు వచ్చింది. దర్యా ప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుం టాం.
-హరినాథ్, ఏసీపీ రాచకొండ సైబర్ క్రైం


logo