ముంబై : యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన నోరు జారారు. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని బాబా రాందేవ్ అన్నారు. యోగా క్లాసుకు వస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉన్నారు.
'Women would look good even if they don't wear anything: Baba Ramdev's controversial statement sitting beside Amruta Fadnavis#ramdevbaba #AmrutaFadnavis #ViralVideos pic.twitter.com/e81PO6LTDG
— Mumbai Live (@MumbaiLiveNews) November 25, 2022