చెన్నై: కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ), కావేరీ రెగ్యులేషన్ కమిటీ(సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘించిందని, తమకు దక్కాల్సిన నీటిని విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకకు తగినంత నీటి లభ్యత ఉన్నప్పటికీ నీటి విడుదలకు నిరాకరించడం తగదని తమిళనాడు పేర్కొంది. తమకు రావాల్సిన కావేరీ జలాలను ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది.