Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 25 : మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించారని ఎస్సై జగదీశ్వర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, పాలకవర్గంతో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. ప్రతీ విద్యార్థి మొక్కలను నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు పచ్చదనం పెంపొందించేందుకు ముందుకు రావాలన్నారు. పర్యావరణ పై అవగాహన బాధ్యత పెరుగుతాయని అన్నారు.
విద్యార్థులు నాటే మొక్కలు రేపు రాబోయే తరానికి ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థులు ఇంటి వద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు విద్యార్థులు నాటిన మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గాజుల శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు రాచకొండ సంపత్, కొక్కిస సతీష్, దాసరి శ్రావణ్, సిద్ధంకి అనిల్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, విద్యార్థులు పాల్గొన్నారు.