శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Dec 16, 2020 , 02:01:20

ముమ్మరంగా యాసంగి నాట్లు

ముమ్మరంగా యాసంగి నాట్లు

  • మూడు వేల ఎకరాల్లో బోర్లు, బావుల కింద వరిసాగు
  • పనుల్లో రైతన్న బిజీబిజీ

వాజేడు, డిసెంబర్‌ 15 : తెలంగాణ ప్రభుత్వం  కోతలు లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో మండలంలోని రైతులు బోర్లు, వ్యవసాయ బావుల వద్ద నాట్లు వేస్తున్నారు. జగన్నాథపురం, దూలపురం, ధర్మవ రం, కాసారం, అరుణాచలపురం, కొప్పుసూరు, అన్నారం, అయ్యవారిపేట, ఎడ్జర్లపల్లి గ్రామాల్లో యా సంగి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  మండల వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. బాండ్‌ సాగు పద్ధతిలో ఎకరాలో నాటు వేసేందుకు రూ.5 వేలు, మా మూలు పద్ధతిలో అయితే  రూ. 3 వేలు ఇచ్చి కూలీలతో నాట్లు వేయిస్తున్నట్లు రైతులు పేర్కొం టున్నారు. రైతులు పొలంపనుల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. కూ లీలకు సైతం చేతి నిండా పని దొరికింది. 

24 గంటలు కరంట్‌ ఇవ్వడం వల్లే..

రైతులకు తెలంగాణ సర్కార్‌ 24 గంటల నిరంతర ఉచిత కరంట్‌ ఇవ్వ డం వల్లే త్వరగా నాట్లు వేస్తున్నాం.  యాసంగిలో బాండ్‌ వరి సాగు లాభ సాటిగా ఉంది. సీజన్‌ ప్రారంభంలోనే నాట్లు వేస్తున్నాం.

- వాత్సవాయి జగన్నాథరాజు,  రైతు 


VIDEOS

logo