Nani New Look | సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్నాని. ఫలితం ఎలా ఉన్నా ఆయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అయితే గతకొంత కాలంగా నాని సినిమాలు కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోతున్నాయి. ‘ఎమ్సీఏ’ తర్వాత నాని నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం నాని ఆశలన్నీ ‘దసరా’ సినిమాపైనే ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా నాని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎపిక్ మూవీ దసరా షూటింగ్ పూర్తయింది. డైమండ్ లాంటి సినిమా ఎప్పుడూ ప్రకాశిస్తుంది’ అని పోస్టు చేస్తూ చిన్న వీడియో గ్లింప్స్ షేర్ చేశాడు. ఈ సినిమా కోసం నాని మాస్ అవతారంలో పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలకే గడ్డం, మీసం తీసేసి లవర్ బాయ్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ‘New Day.. New Me’ అంటూ క్యాప్షన్ పెట్టి క్లీన్ షేవ్‌తో ఉన్న మిర్రర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ లుక్ నాని తదుపరి సినిమా కోసమే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మొదటి సారి నాని ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో నాని అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.