Nani Dasara Movie | మూడేళ్ల కింద వరకు వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ఆయనను చూసి మిగిలిన హీరోలు కూడా కుళ్లుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినా.. అద్భుతమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా నానికి సరైన బ్లాక్‌బస్టర్ రావడం లేదు. చేసిన సినిమాలు చేసినట్టుగా వచ్చి వెళ్లిపోతున్నాయి.. గతేడాది విడుదలైన శ్యామ్ సింగరాయ్ జస్ట్ సేఫ్ జోన్లోకి వచ్చింది. దానికి ముందు వచ్చిన సినిమాలేవి అంచనాలను అందుకోలేదు. మొన్న విడుదలైన అంటే సుందరానికి కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా నిలబడకపోవడం.. పడిపోతున్న నాని మార్కెట్‌కు నిదర్శనం. ఇప్పటికిప్పుడు దీన్ని నిలబెట్టుకోకపోతే ఆయన కెరీర్ మరింత దిగజారడం ఖాయం. పడిపోతున్న మార్కెట్‌ను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న ఇలాంటి సమయంలో నానిని టెన్షన్ పెట్టేందుకు మరొక గండం వేచి చూస్తుంది.
సాధారణంగా ఎవరైనా మాస్ సినిమాలు చేస్తే సేఫ్ జోన్ అంటారు. కానీ నాని మాస్ అవతారం ఎత్తడం అంటే మాత్రం ప్రయోగమే అయిపోతుంది. ఎందుకంటే ఆయన కెరీర్లో పూర్తిగా గెటప్ మార్చి చేసిన ఏ మాస్ సినిమా హిట్ కాలేదు. భీమిలి కబడ్డీ జట్టు, జెండాపై కపిరాజు, కృష్ణార్జున యుద్ధం, ఇంద్రగంటి మోహనకృష్ణ వి, టక్ జగదీష్ లాంటి సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఈయన దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కూడా పూర్తిగా గెటప్ మార్చి కొత్తగా కనిపిస్తున్నాడు నాని. దాంతో ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఈ సినిమా కథపై తనకు చాలా నమ్మకం ఉందని అంటున్నాడు నాని. అందుకే కొత్త దర్శకుడు అయినా కూడా శ్రీకాంత్ ఓదెలను నమ్మి ఏకంగా రూ. 60 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. 2023 మార్చి 30న సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాని తన మాస్ గండం దాటుతాడా లేదా చూడాలి.
“Nani Promo | ‘రేపటి సంది దుమ్ము లేశిపోద్ది..’అంటూ ముందే ప్రోమో లీక్ చేసిన నాని”