Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన ‘గదర్-ఏక్ ప్రేమ్ కథా’ (Gadar Ek Prem Katha) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్-2 (Gadar 2) తెరకెక్కింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. 1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఇప్పటివరకు మొత్తం రూ.305.13 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా మార్కెట్ వర్గాల సమాచారం. రానున్న వారం రోజుల్లో మరో కొత్త రికార్డును కూడా బద్దలు కొట్టనున్నది.
Biggest 2nd Friday ever for Hindi film .#Gadar2 collects 20.50 Cr on 8th day beating #Bahubali2 & #Pathaan .#SunnyDeol is hitting the ball out of Park everyday . Mass centres will be doing this till 4th week 🔥🔥🔥.#Gadar2Unstoppable #Gadar2ManiaContinues @Anilsharma_dir pic.twitter.com/sS1dJGWTEB
— #Gadar2 #SunnyDeol #BobbyDeol #chup #Dharam#Ashram (@LegendDeols) August 19, 2023
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అనిల్ శర్మ దర్శకత్వం వహించగా.. కమల్ ముఖుత్తో కలిసి అనిల్ శర్మ సంయుక్తంగా నిర్మించారు. ఉత్కర్ష్ శర్మ, స్మృతీ కౌర్, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి మిథున్, మోంటీ శర్మ సంగీతం అందించారు.
300 NOT OUT… #Gadar2 continues to ROAR… Mass pockets are in an altogether different league… Also, the contribution from Tier 2 and Tier 3 sectors will set a new benchmark… Expect BIGGG JUMP on [second] Sat and Sun… [Week 2] Fri 20.50 cr. Total: ₹ 305.13 cr. #India biz.… pic.twitter.com/OMTP6Z4BJJ
— taran adarsh (@taran_adarsh) August 19, 2023