సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 20:22:02

కల్నల్‌ సంతోష్‌ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్‌ నివాళి

కల్నల్‌ సంతోష్‌ పార్థివదేహానికి  మంత్రి కేటీఆర్‌ నివాళి

హైదరాబాద్‌: అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం హైదరాబాద్‌కు చేరుకున్నది. ఆయన భౌతికకాయాన్ని  ఏఎన్‌ 32 ఎయిర్‌ క్రాఫ్ట్‌లో   హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు బుధవారం సాయంత్రం తీసుకొచ్చారు. సంతోష్‌ భౌతికకాయానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ,  మల్లారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి,  మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, ఆర్మీ ఉన్నతాధికారులు  నివాళులర్పించారు.

హకీంపేట్‌లో ఆర్మీ సైనిక వందనం సమర్పించిన  అనంతరం ఓఆర్‌ఆర్‌ మీదుగా  పార్థివదేహాన్ని సూర్యాపేటలోని ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. సంతోష్‌ బాబు అంత్యక్రియలు గురువారం అధికారికంగా నిర్వహించనున్నారు. logo