శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:42

బీసీలు ఉన్నత చదువులు చదవాలని..

బీసీలు ఉన్నత చదువులు చదవాలని..

మాజీ ప్రధాని పీవీతో నాకు చాలా అనుబంధం ఉంది. 1984లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఇంజినీరింగ్‌ సీటు కావాలని ఆయన దగ్గరకు పోయాం. డబ్బులు కట్టాలని కాలేజీ వాళ్లు చెబితే.. బీసీలు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువుల వరకు వస్తున్నారు, డబ్బులు కట్టమంటే ఎలా? అని ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంజినీరింగ్‌ సీటు ఇవ్వాలని ఒక చీటి మీద రాసిచ్చారు. అలా పీవీ వల్ల నేను ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశాను. ముఖ్యంగా వంగర గ్రామానికి సాగునీరు అందించాలని పీవీ చాలా కృషి చేశారు. పీవీ కన్న కలలను కాళేశ్వరం జలాలు అందించడం ద్వారా సీఎం కేసీఆర్‌ సాకారం చేస్తున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాను. కరీంనగర్‌-వరంగల్‌ రహదారికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలి. 

-గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి

నిరుపేదల బతుకుల్లో అక్షరాల వెలుగు 

దేశం గర్వించదగిన గొప్ప మేధావి పీవీ. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పుట్టిన బిడ్డలుగా మేమంతా గర్వపడుతున్నాం. దేశాన్ని సమర్ధవంతంగా పాలించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈరోజు అనేక మంది దళిత, గిరిజన బిడ్డలు గురుకులాల్లో చదువుకొని ఉన్నతమైన అవకాశాలు పొందుతున్నారంటే గతంలో పీవీ నవోదయ, గురుకులాలకు పునాది వేయడమే.

-సత్యవతి రాథోడ్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి

గొప్ప వ్యక్తికి అన్యాయం జరిగింది

మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేం డ్లు భుజాల మీద మోసిన గొప్ప వ్యక్తి పీవీ. తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని దాకా వెళ్లారు. అలాంటి వ్యక్తి గుర్తించి ప్రపంచ దేశాలకు తెలిసేలా సీఎం ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీలు కూడా ఇప్పటివరకు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు.  అందుకే సీఎం కేసీఆర్‌, తెలంగాణ బిడ్డగా ఆయన సేవలను ప్రస్తు త, భావితరాలకు గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

- శ్రీనివాస్‌గౌడ్‌, పర్యాటకశాఖ మంత్రి

భారతరత్నకు వందశాతం అర్హుడు

14 భాషలు మాట్లాడగలిగే పీవీ అక్షరాభాస్యం బాసరలో జరిగింది. అందుకే నిర్మల్‌లో ఒక సభ జరిగిన సందర్భంగా బాసరకు ఆహ్వానిస్తే వచ్చి గతపాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. పీవీ వంద శాతం భారతరత్నకు అర్హుడు.

- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి  


logo