శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 07:06:52

లద్ధాఖ్‌లో స్వల్ప భూప్రకంపనలు

లద్ధాఖ్‌లో స్వల్ప భూప్రకంపనలు

లద్దాఖ్‌ : కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో శనివారం రాత్రి 2 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం తెలిపింది. లద్దాఖ్‌కు 34.8 అక్షాంశ, 78.05 రేఖాంశాల నడుమ పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని ఎన్‌సీఎస్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo