మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 06:55:42

బ‌న్నీ షూటింగ్‌కి అడుగ‌డుగునా అవాంత‌రాలే..!

బ‌న్నీ షూటింగ్‌కి అడుగ‌డుగునా అవాంత‌రాలే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీకి అడుగ‌డుగున అవాంత‌రాలు ఎదురువుతున్నాయి. ఈ మూవీ  షూటింగ్‌ను ఎక్కువ భాగం అడవుల్లోనే చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శేషాచలం అడవుల్లో చిత్రీకరణ కోసం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది చిత్ర బృందం. క‌రోనా కార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం వారి అర్జీని తిర‌స్క‌రించింది. 

థాయ్‌లాండ్‌లో చిత్ర షూటింగ్ జ‌ర‌పాల‌ని టీం భావించ‌గా,  అక్కడ కరోనా రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు దర్శకుడు. ఇక కేరళలోని అడవుల్లో షూటింగ్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారట. కానీ కేరళలో కూడా కరోనా వలన షూటింగ్‌లకు అనుమతిని నిరాకరించడంతో ఇప్పుడు బన్నీ టీమ్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సుకుమార్ అండ్ టీం కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. చిత్రంలో  అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో, రష్మిక మందన్న పల్లెటూరి యువతిగా నటించబోతున్నట్లు టాక్.  జగపతి బాబు, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. 


logo